దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో దూకుడు పెంచింది కేంద్రం. ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఈ దాడి వెనుక జిప్ లైన్ ఆపరేటర్ ఉన్నట్లు అనుమానిస్తోంది. రిషి భట్ అనే పర్యాటకుడిని జిప్‌లైన్‌లోకి పంపే ముందు అల్లాహో అక్బర్ అని ఆపరేటర్ నినాదాలు చేసినట్లు సమాచారం. అదే సమయంలో ఉగ్రవాదుల కాల్పుల శబ్దాలు వినిపించాయి. టెర్రరిస్టులు వస్తున్నారనే విషయం జిప్‌లైన్ ఆపరేటర్‌కి ముందే తెలుసు కాబట్టే నినాదాలు చేశాడని అనుమానం వ్యక్తం చేస్తోంది ఎన్ఐఏ. రిషి భట్ సెల్ఫీ వీడియోలో నినాదాలు స్పష్టంగా వినిపించాయి.