హైడ్రా కమిషనర్ కు ఘనంగా సత్కారం
NEWS Apr 29,2025 08:44 am
రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీ ఇంజాపూర్ గ్రామంలోని శ్రీ రంగాపురం కాలనీలో 45 అడుగుల ప్రధాన రహదారిపై అడ్డంగా కట్టిన ప్రహరీని హైడ్రా ఈ నెల 19న తొలగించింది. ఈ సందర్బంగా యాపిల్ ఎవెన్యూ, శ్రీరంగాపురం, సాయినాథ్‌కాలనీ, సుందరయ్య కాలనీ, శ్రీ శ్రీనివాస కాలనీ, ఇందిరమ్మ కాలనీ 1, ఇందిరమ్మ కాలనీ 2 నివాసితులు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ను కలిశారు. ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. శాలువాతో తనను ఘనంగా సన్మానించారు. హైడ్రా వల్ల ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. దీనికంతటికీ తనే కారణమని కొనియాడారు.