వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు భారీ ఊరట లభించింది. తనతో పాటు ఆయన అనుచరులకు బెయిల్ మంజూరు చేసింది గుంటూరు కోర్టు. ఒక్కొక్కరికి రూ.20 వేలతో కూడిన పూచీకత్తు పాటు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం పట్ల ధన్యవాదాలు తెలిపారు మాజీ ఎంపీ. ఈ సందర్బంగా ఆయన ఏపీ కూటమి సర్కార్ పై నిప్పులు చెరిగారు. కేవలం కక్ష సాధింపు చర్యలు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. అన్ని అక్రమ కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు.