డబ్బులు దొరికితే చాలు చెప్పకుండా ఇంటికి తీసుకు వెళ్లే ప్రబుద్దులు ఉన్న ఈ కాలంలో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఆర్టీసీ డిపోకు చెందిన కండక్టర్ వెంకటేశ్వర్లు మానవత్వాన్ని చాటుకున్నారు. ఈనెల 26న అచ్చంపేట నుండి హైదరాబాద్ వెళ్లే బస్సులో రూ. 13 లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలతో పాటు కొంత నగదును పోగొట్టుకున్నాడు ఓ ప్రయాణీకుడు. వాటిని గమనించి భద్రంగా తిరిగి బాధితుడికి అందజేశాడు. ఈ సందర్బంగా కండక్టర్ వెంకటేశ్వర్లును ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఘనంగా సన్మానించారు. తనను ప్రత్యేకంగా అభినందించారు.