కడప జిల్లాలో ఉన్న శ్రీ పోతులూరి బ్రహ్మంగారి మఠంను ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ది చేస్తామని చెప్పారు మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. డీకేటి భూములపై స్పెషల్ ఆఫీసర్ శిరీషతో సర్వే చేయిస్తామన్నారు. ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకుంటామని, వాటిని పేదలకు పంపిణీ చేస్తామని ప్రకటించారు. మండలంలో 20 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయని 14 గ్రామాలలో భూ రీ సర్వే పూర్తి చేయడం జరిగిందన్నారు. శ్రీ జగన్మాత ఈశ్వరి దేవి మఠం కు రూ. 3 కోట్లు కేటాయించామన్నారు.