పద్మభూషణ్ అందుకున్న బాలయ్య
NEWS Apr 29,2025 08:19 am
ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు నటుడు నందమూరి బాలకృష్ణ. తెలుగు సంప్రదాయ దుస్తులను ధరించిన ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. సినీ, కళా, సేవా రంగాలలో గత కొన్నేళ్లుగా చేసిన కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది. ఆయనతో పాటు తమిళ సినీ రంగానికి చెందిన నటుడు అజిత్ కుమార్ కు కూడా పద్మ అవార్డు దక్కింది.