హైదరాబాద్‌లో ఈడీ విస్తృత సోదాలు
NEWS Apr 29,2025 08:16 am
భూదాన భూముల వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ హైదరాబాద్ లో విస్తృతంగా సోదాలు చేపట్టింది. మొత్తం 13 చోట్ల తనిఖీలు చేసింది. మునావర్ ఖాన్ కు చెందిన ఇల్లు, ఆఫీసులు, బంధువుల ఇళ్లలో దాడులకు దిగింది. తనకు చెందిన 40 వింటేజ్ కార్లను సీజ్ చేసింది. తన ఇంట్లో భారీగా ఉన్న భూదాన్ భూముల పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. వందలాది ఎకరాలను కబ్జా చేసి రియల్టర్లు, ఉన్నతాధికారులకు అమ్మినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈడీ రంగంలోకి దిగింది.