శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.53 కోట్లు
NEWS Apr 29,2025 08:04 am
తిరుమల పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో కిటకిట లాడుతోంది. కోరిన కోర్కెలు తీర్చే శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 65 వేల 904 మంది భక్తులు దర్శించుకున్నారు. 24 వేల 487 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.53 కోట్లు వచ్చినట్లు తెలిపారు టీటీడీ ఈవో జె. శ్యామల రావు. ప్రస్తుతం స్వామి వారి దర్శనం కోసం డైరెక్టు లైన్ కొనసాగుతోందని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 8 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.