తెలంగాణ కోసం మేమంతా పోరాటం చేశాం
NEWS Apr 28,2025 06:34 pm
బీఆర్ఎస్ వల్ల తెలంగాణ రాలేదని, తామంతా కలిసి పోరాడితే వచ్చిందన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బీఆర్ఎస్ అనేది కుటుంబ పార్టీ అని, తమది పేదల పార్టీ అని అన్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ మీద ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. కేవలం సోషల్ మీడియాలోనే అలా మాట్లాడుతున్నారంటూ వాపోయారు. అసెంబ్లీకి రాకుండా బహిరంగ సభలు పెట్టి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ రాష్ట్రాన్ని ఎలా సర్వ నాశనం చేశారో తాము శాసన సభ సాక్షిగా చెప్పేందుకు ప్రయత్నం చేస్తామన్నారు.