టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాజీ సీఎం కేసీఆర్ పై భగ్గుమన్నారు. ఆయన తెలంగాణ పాలిట విలన్ గా మారాడని ఆరోపించారు. దేశం కోసం సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కేసీఆర్‌కు ఎక్కడిదని ప్రశ్నించారు. తమ పార్టీ వల్లనే రాష్ట్రం ఏర్పడిందని ఆ విషయం మరిచి పోతే ఎలా అన్నారు. తెలంగాణ ఇచ్చిన పాపానికి కాంగ్రెస్ విలన్ అయ్యిందా అని మండిపడ్డారు. ఏడాది లోపే 60 వేల ఉద్యోగాలు ఇచ్చినందుకు తమ సర్కార్ తప్పు చేసిందని అనుకుంటున్నారా అంటూ ఫైర్ అయ్యారు.