మాజీ సీఎం కేసీఆర్ ఓరుగల్లులో నిర్వహించిన సభ అట్టర్ ప్లాప్ అయ్యిందంటూ ఎద్దేవా చేశారు మంత్రి కొండా సురేఖ. కేసీఆర్ ఇన్నాళ్లు ఫామ్‌హౌస్‌లో కూర్చుని నిన్న సభలో ఏం మాట్లాడాలో మర్చి పోయాడంటూ ఎద్దేవా చేశారు. ప్రజలకు, ప్రభుత్వానికి దిశానిర్దేశం చేస్తారని అనుకుంటే సొల్లు కబుర్లు చెప్పాడన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా ప్రస్తావించక పోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసెంబ్లీని కించపరిచేలా మాట్లాడిన కేసీఆర్ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలన్నారు.