దేశం గర్వపడేలా అమరావతి నిర్మాణం
NEWS Apr 28,2025 05:25 pm
మోదీ పర్యటన సందర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. దేశం గర్వం పడేలా అమరావతి రాజధాని నిర్మాణం చేపడతామని చెప్పారు. అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి మే 2 న ప్రధాని నరేంద్రమోదీ వస్తున్న క్రమంలో ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు. మచిలీపట్నం కలెక్టరేట్ లో మంత్రులు కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, వాసంశెట్టి సుభాష్, కలెక్టర్ డీ కే బాలాజీ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. మోదీ సభకు తరలివచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. రవాణా సదుపాయం, తాగు నీరు వసతి, ట్రాఫిక్ సమస్యలు లేకుండా సభ వేదికకు చేరుకోవడం వంటి సన్నాహాక ఏర్పాట్లపై సూచనలు చేశారు.