ప్రధాని మోదీతో రాజ్ నాథ్ సింగ్ భేటీ
NEWS Apr 28,2025 12:37 pm
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హుటా హుటిన పీఎం మోదీ ఇంటికి వెళ్లారు. దాదాపు 40 నిమిషాలకు పైగా సమావేశం అయ్యారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, కాశ్మీర్ లో సైనిక సన్నద్ధతపై చర్చలు జరిపారు. ఉగ్రవాదుల ఏరివేత చర్యలను వివరించారు పీఎంకు. ఈ కీలక భేటిలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. అంతకు ముందు ఆర్మీ చీఫ్ రాజ్ నాథ్ సింగ్ తో భేటీ కావడం ప్రాదాన్యత సంతరించుకుంది.