భక్త సందోహం తిరుమల పుణ్యక్షేత్రం
NEWS Apr 28,2025 09:09 am
వేసవి సెలవులు కావడంతో భక్తుల రద్దీ అంతకంతకూ ఎక్కువవుతోంది. తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. ఎక్కడ చూసినా శ్రీవారి నామ స్మరణే వినిపిస్తోంది. ఆపద మొక్కుల వాడిని కొలిచేందుకు భక్తులు బారులు తీరారు. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 78 వేల 177 మంది భక్తులు దర్శించుకున్నారు. 23 వేల 694 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.53 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో జె. శ్యామల రావు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం కలుగుతోంది.