జెఎన్ యు విద్యార్థి ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థుల హవా
NEWS Apr 28,2025 08:31 am
ప్రతిష్టాత్మకమైన జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీకి జరిగిన ఎన్నికల్లో 9 ఏళ్ల తర్వాత తిరిగి వామపక్ష విద్యార్థి సంఘాలకు చెందిన అభ్యర్థులు గెలుపొందారు. తమ ఆధిపత్యాన్ని నిలుపుకున్నారు. నాలుగు కేంద్ర ప్యానెల్ పదవులలో మూడింటిని కైవసం చేసుకున్నాయి. కాగా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ఏబీవీపికి కీలక పోస్ట్ దక్కడం విశేషం. సోమవారం ఉదయం ఈ ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA)కి చెందిన నితీష్ కుమార్ 1,702 ఓట్లతో అధ్యక్ష పదవిని గెలుచుకున్నారు. అతని సన్నిహిత పోటీదారు, ABVPకి చెందిన శిఖా స్వరాజ్ 1,430 ఓట్లను సాధించగా, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) మద్దతు ఉన్న తయబ్బా అహ్మద్ 918 ఓట్లను సాధించారు.