షూటింగ్ లో ఉన్నా విచారణకు హాజరు కాలేను
NEWS Apr 27,2025 06:10 pm
సాయి డెవలపర్స్ , సురానా గ్రూప్ సంస్థల నుంచి డబ్బులు చెక్కులు, నగదు రూపేణా తీసుకున్నారన్న ఆరోపణలపై విచారణకు హాజరు కావాల్సిన మహేష్ బాబు డుమ్మా కొట్టాడు. తను ఇవాళ హాజరు కాలేనని, షూటింగ్ లో బిజీగా ఉన్నానని ఇంకో తేదీన తనకు విచారణకు సంబంధించి కేటాయించాలని కోరాడు. కాగా పై రెండు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఇందుకు గాను మహేష్ బాబు రూ. 5.9 కోట్లు తీసుకున్నాడని ఈడీ తెలిపింది. ఇందులో మనీ లాండరింగ్ చోటు చేసుకుందనే దిశగా నోటీసులు జారీ చేసింది.