దేశ ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. మరోసారి పాకిస్తాన్ ను హెచ్చరించారు. ఉగ్రవాదులను ఏరి పారేస్తామన్నారు. ఎక్కడున్నా సరే మరోసారి ఇండియా అంటే జడుసుకునేలా చేస్తామన్నారు. పహల్గామ్ దాడి ఘటన పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం జాతిని ఉద్దేశించి మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ప్రసంగించారు. కష్టకాలంలో దేశం ఏకతాటిపై నిలిచిందన్నారు.