పంజాబ్..కోల్ కతా మ్యాచ్ వర్షార్ఫణం
NEWS Apr 27,2025 08:49 am
కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్ ఎలెవన్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఎంతకూ తగ్గక పోవడంతో గత్యంతరం లేక అంపైర్లు మ్యాచ్ ను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ చొప్పున కేటాయిస్తున్నట్లు తెలిపారు. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆ జట్టు ఓపెనర్లు ప్రభ్ సిమ్రన్ సింగ్ మాన్, ప్రియాంశ్ ఆర్యలు ఆకాశమే హద్దుగా చెలరేగారు. కోల్ కతా బౌలర్లను ఊచకోత కోశారు. సింగ్ 49 బంతుల్లో 6 ఫోర్లు 6 సిక్సర్లతో 83 రన్స్ చేశాడు. ఆర్య 35 బంతుల్లో 69 రన్స్ చేశాడు. ఇందులో 8 ఫోర్లు 4 సిక్స్ లు ఉన్నాయి. ఆ తర్వాత బరిలోకి దిగిన కోల్ కతా గుర్జాబ్, సరైన్ ఆడేందుకు ప్రయత్నం చేశారు. ఇందలో వర్షం రావడంతో పెవిలియన్ బాట పట్టారు.