కాళేశ్వరం ఏజెన్సీకి రూ.200 కోట్ల ఆస్తులు ఉన్నట్లు గుర్తించింది ఏసీబీ. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ భూక్యా హరిరామ్ ను అరెస్ట్ చేసింది. అక్రమ ఆస్తులకు సంబంధించి కేసు నమోదు చేసింది. గజ్వేల్ లో భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించింది. ఈఎన్సీ హరిరామ్ , ఆయన బంధువుల ఇళ్లల్లో 13 చోట్ల ఏసీబీ సోదాలు చేపట్టింది.