రైతులకు రూ. 20 వేల కోట్ల రుణమాఫీ చేశాం
NEWS Apr 26,2025 05:34 pm
రైతులకు రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేశామని, దేశంలోనే ఇదే అతిపెద్ద రుణమాఫీ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతు భరోసా పేరుతో ఎకరాకు ఏడాదికి రూ.12 వేల ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తున్నామన్నారు. హైదరాబాద్ లో జరిగిన భారత్ సమ్మిట్ లో పాల్గొన్నారు. భూమి లేని రైతు కూలీలకు ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.12 వేల సాయం అందిస్తున్నామన్నారు.రైతుల పండించిన ధాన్యానికి మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నామన్నారు.
యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీని ప్రారంభించామని తెలిపారు. అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే 60 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. 5 లక్షల మంది యువతకు ప్రయోజనం కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించామన్నారు.