మే 10 నుండి దేవుని గడప తెప్పోత్సవాలు
NEWS Apr 26,2025 04:24 pm
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. మే 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి తెప్పోత్సవాలు జరుగుతాయని తెలిపింది. స్వామి, అమ్మవార్లు ఆలయ పుష్కరిణిలో ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు తెప్పలపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఇందులో భాగంగా మే 10న శ్రీ కృష్ణ సమేత గోదాదేవి మూడు చుట్లు, మే 11న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఐదు చుట్లు, మే 12న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఏడు చుట్లు తెప్పలపై తిరిగి కనువిందు చేయనున్నారని తెలిపింది.