వీఎచ్ పీ ఆధ్వర్యంలో బంద్
NEWS Apr 26,2025 01:09 pm
కాశ్మీర్ లోని పహెల్గాంలో హిందువులపై ఉగ్రవాదుల దాడులను నిరసిస్తూ శనివారం బీజేపీ, హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఎండపల్లి మండలం రాజారాంపల్లి ముఖ్య కూడలి స్వామి వివేకానంద విగ్రహం పరిసర ప్రాంతంలో గల దుకాణ సముదాయాలను వ్యాపారస్థులు స్వచ్ఛందంగా, సంపూర్ణంగా మూసి వేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ బందోబస్తు ఏర్పాటు చేయగా ఇంటెలిజెన్స్ శాఖ గోప్యత సమాచారం పై దృష్టి సారించింది.