లిక్కర్ స్కామ్ కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్
NEWS Apr 26,2025 09:15 am
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరొకరిని అదుపులోకి తీసుకుంది ఏపీ సిట్. ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్‌రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ప్రధాన కుట్రదారుల్లో ఒకరైన తనను ఆరో నిందితుడిగా చేర్చింది. ఇవాళ విజయవాడ సిట్ కోర్టులో హాజరుపర్చనుంది. ఈ కేసులో ఏ6గా ఉన్నారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉన్నట్లు గుర్తించింది. 2019లో వైఎస్సార్సీపీ అధికారం చేపట్టాక నూతన మద్యం విధానం ముసుగులో నెలనెలా రూ.50 నుంచి రూ.60 కోట్ల రూపాయల మేర ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.