ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రధానమంత్రి మోదీని కలిశారు. మే2వ తేదీన ఏపీలో జరిగే కార్యక్రమాలకు హాజరు కావాలని ఆహ్వానించారు. ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. కేంద్ర సర్కార్ తీసుకునే నిర్ణయానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ దాడి ఘటన పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. దేశ భద్రతను కాపాడటంలో పీఎంకు అందరూ సపోర్ట్ చేయాలని పిలుపునిచ్చారు.