కేసీఆర్ సభ సక్సెస్ కావడం ఖాయం
NEWS Apr 24,2025 05:53 pm
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన రేవంత్ రెడ్డి సర్కార్ ను ఇబ్బంది పెట్టేలా కామెంట్స్ చేశారు. కేసీఆర్ వరంగల్ లో నిర్వహించే సభ కచ్చితంగా సక్సెస్ అవుతుందని తాను అనుకుంటున్నానని అన్నారు. కేసీఆర్ ను చూడాలని జనం ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. సభకు ఆశించిన దానికంటే ఎక్కువగా రావచ్చని అనుకుంటున్నట్లు తెలిపారు.