చాకలి ఐలమ్మ యూనివర్శిటీలో ఆందోళన
NEWS Apr 24,2025 05:53 pm
హైదరాబాద్ లోని కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్శిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. వైస్ ఛాన్సలర్ ఛాంబర్ ఎందుట బైఠాయించారు. హాస్టల్ లో తమకు కనీస సౌకర్యాలు లేవని వాపోయారు. సమస్యలు పరిష్కరించేందుకు ఆందోళన విరమించే ప్రసక్తి లేదంటూ స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున వీసీకి, సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.