భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది
NEWS Apr 24,2025 01:37 pm
ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ లో జరిగిన సభలో పాకిస్తాన్ ను ఉద్దేశించి మండిపడ్డారు. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఏ ఒక్కరినీ వదిలి పెట్టమన్నారు. దాడి చేసిన ప్రతి ఒక్కరినీ వెతికి పట్టుకుని తీరుతామన్నారు. ఇది టూరిస్టులపై జరిగిన దాడి కాదని, దేశంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఎవరూ ఊహించని విధంగా భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదం కోసం ఉపయోగిస్తున్న భూభాగాన్ని నాశనం చేస్తామని అన్నారు. టెర్రరిస్టులు కలలో కూడా ఊహించని శిక్ష విధిస్తామన్నారు.