ఉగ్రవాదుల ఊహా చిత్రాలు రిలీజ్
NEWS Apr 23,2025 06:31 pm
పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన వారి ఊహా చిత్రాలు విడుదల చేసింది కేంద్రం. అసిఫ్ ఫౌజి, సులేమాన్ షా, అబు తాలాగా దర్యాప్తు బృందాలు గుర్తించాయని తెలిపింది. ఉగ్రదాడి నుంచి బయటపడిన సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం వీటిని తయారు చేసినట్లు పేర్కొంది. టెర్రరిస్టులు పురుషులను వేరు చేసి వారి గుర్తింపులను పరిశీలిస్తున్న సమయంలో వారి ముఖాలను చూశారు బాధితులు.