పహల్గామ్ దాడిలో పాల్గొన్న టెర్రరిస్టుల గుర్తింపు
NEWS Apr 23,2025 05:23 pm
కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను గుర్తించింది. దాడికి పాల్పడిన వారిలో ఇద్దరు కాశ్మీరీలుగా అనుమానం వ్యక్తం చేసింది. 2018లో కాశ్మీర్ను వదిలి పాక్కు వెళ్లిపోయిన అదిల్ గురి, అషన్.. ఇటీవలే మరో నలుగురితో కలిసి మళ్లీ కాశ్మీర్లోకి చొరబడ్డారంటూ వెల్లడించింది. పాక్ మద్దతుదారుల నుంచి వారికి ఏకే-47 ఆయుధాలు, మందుగుండు సామాగ్రి లభించిందని స్పష్టం చేశారు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.