పాకిస్తాన్ కు గుణపాఠం చెబుతాం
NEWS Apr 23,2025 04:56 pm
పహల్గామ్ ఉగ్రవాదుల దాడి ఘటనపై తీవ్రంగా స్పందించారు దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. చేతులు ముడుచుకుని కూర్చోలేదన్నారు. ఈ దాడి తర్వాత పాకిస్తాన్ యావత్ ప్రపంచం ముందు దోషిగా నిలిచిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. బదులు తీర్చుకుంటామని, అవసరమైతే అన్నింటిని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. ఇక నుంచి ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తి లేదన్నారు. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ అంతటా జల్లెడ పడుతున్నామని చెప్పారు. ప్రధానంగా పాకిస్తాన్ ఆర్మీకి వార్నింగ్ ఇచ్చారు.