ఏపీ పదవ తరగతి ఫలితాలు విడుదల
NEWS Apr 23,2025 11:40 am
ఏపీ సర్కార్ పదవ తరగతి పరీక్షా ఫలితాలను వెల్లడించింది. 4,98,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 81.14 శాతం ఉత్తీర్ణత సాధించారు. 6,14,459 మంది పరీక్షలు రాశారు. 1680 బడులు 100 శాతం రిజల్ట్స్ సాధించాయి. మే 19 నుంచి 28 వరకు ఫెయిల్ అయిన వారికి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు విద్యా శాఖ కార్యదర్శి.