వైసీపీ కార్యకర్త కృష్ణవేణికి రిమాండ్
NEWS Apr 23,2025 09:07 am
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పాలేటి కృష్ణవేణికి షాక్ తగిలింది. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు మార్ఫింగ్ ఫోటోలను పోస్ట్ చేశారంటూ ఆమెపై కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరు పర్చగా తనకు 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. ప్రస్తుతం తను గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉంది. పీటీ వారెంట్‌పై కృష్ణవేణిని కోర్టుకు తీసుకు వచ్చారు పోలీసులు.