శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.61 కోట్లు
NEWS Apr 23,2025 08:46 am
తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిటకిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 61 వేల 828 మంది భక్తులు దర్శించుకున్నారు. 21 వేల 165 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.61 కోట్లు వచ్చినట్లు ఈవో జె. శ్యామల రావు వెల్లడించారు. స్వామి వారి దర్శనం కోసం ప్రస్తుతం 2 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 8 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.