సివిల్స్ టాపర్ గా శక్తి దూబే
NEWS Apr 22,2025 05:26 pm
యూపీఎస్సీ విడుదల సివిల్ సర్వీసెస్ ఫలితాలలో సత్తా చాటింది శక్తి దూబే. దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఎవరూ కూడా నిరాశకు లోను కాకూడదని, కలలు కనాలని, దాని కోసం ప్రయత్నం చేయాలని సూచించింది. మన చేసి కృషికి తప్పకుండా ఫలితం ఉంటుందని చెప్పింది. ఇందుకు తాను ఎన్నో అడ్డంకులను దాటుకుని ఇంత దాకా వచ్చానని తెలిపింది. మహిళలు, యువత వెనక్కి తగ్గవద్దని, గెలుపు ఓటములు మన చేతుల్లో ఉంటాయన్నారు. విజయం సాధించేంత దాకా ఆపొద్దంటూ కోరారు.