పేదలకు వరం అన్నా క్యాంటీన్లు
NEWS Apr 21,2025 05:31 pm
పేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్లను ప్రవేశ పెట్టారని అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. రోజుకు 15 రూపాయలతో మూడు పూటలా కడుపు నిండా భోజనం చేస్తున్నారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కావాలని వీటిని రద్దు చేశారని ఆరోపించారు. అందుకే జగన్ ను 11 సీట్లకే పరిమితం చేశారంటూ ఆరోపించారు. ఆనాడు పాలకొల్లులో అన్నా క్యాంటీన్లు మూసివేసిన రోజే తాను సొంత డబ్బులతో మళ్లీ నిర్మించానని చెప్పారు.