మోదీ టూర్ పై మంత్రివర్గ ఉపసంఘం సమీక్ష
NEWS Apr 21,2025 05:16 pm
ఏపీలో మే2న ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ సందర్బంగా మంత్రివర్గ ఉపసంఘం ప్రత్యేకంగా సమావేశమైంది. నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, పొంగూరు నారాయణతో పాటు సీఎస్ విజయ్ ఆనంద్, జిఏడి పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా హాజరయ్యారు. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ లతో కోఆర్డినేషన్ కమటీని ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్లు, బహిరంగ సభ ప్రాంగణం, రహదారుల అభివృద్ధి, భద్రతపై దృష్టి సారించారు. బహిరంగ సభకు సుమారు 5 లక్షల మంది హాజరు కావచ్చని అంచనా. ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది.