అభ్యర్థుల వయో పరిమితి పెంచాలి
NEWS Apr 21,2025 08:58 am
సీపీఐ కార్యదర్శి రామకృష్ణ సుదీర్ఘ లేఖ రాశారు ఏపీ సీఎం చంద్రబాబుకు. రాష్ట్రంలో మెగా డీఎస్సీ ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 2018 నుంచి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయక పోవడంతో చాలా మంది అర్హత కలిగిన అభ్యర్థులకు వయసు మీద పడిందని, వారి పట్ల మానవతా దృక్ఫథంతో వ్యవహరించాలని, వెంటనే వయో పరిమితిని 47 ఏళ్లకు పెంచాలని కోరారు.