విశాఖ శారదా పీఠానికి టీటీడీ నోటీసులు
NEWS Apr 21,2025 08:49 am
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. తిరుమలలో విశాఖ శారదా పీఠానికి టీటీడీ నోటీసులు జారీ చేసింది. వెంటనే తమ భవనాన్ని అప్పగించాలని ఆదేశించింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పనంగా శారదా పీఠానికి మేలు చేకూర్చేలా తిరుమలలో భవనం, విశాఖలో తక్కువ ధరకు భూములు ఇచ్చారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువు తీరింది. ఆ వెంటనే శారదా పీఠంకు అప్పగించిన వాటిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. దీనిపై టీటీడీ కోర్టును ఆశ్రయించింది. పాలక మండలి తీర్మానం ఆమోదించింది. దీనిని సమర్పించడంతో వెంటనే స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశించింది.