తిరుమల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
NEWS Apr 21,2025 08:26 am
తిరుమల పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 82 వేల 746 మంది భక్తులు దర్శించుకున్నారు. 25 వేల 078 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.85 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఈవో జె. శ్యామల రావు వెల్లడించారు. స్వామి వారి దర్శనం కోసం ప్రస్తుతం 7 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు 12 గంటలకు పైగా సమయం పడుతుందని తెలిపారు.