భక్తుల సేవలో శ్రీవారి సేవకులు
NEWS Apr 21,2025 07:20 am
తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో శ్రీవారి దర్శనానికి దాదాపు 20 గంటల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో నారాయణగిరి షెడ్ల వద్ద టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తనిఖీలు నిర్వహించారు.క్యూలైన్లలో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులు ఇబ్బంది పడకుండా నిరంతరాయంగా అన్న ప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేయాలని ఆదేశించారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా శ్రీవారి సేవకుల సేవలను వినియోగించు కోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు రాజేంద్ర, హరీంద్రనాథ్, వీజీవో సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.