భారత్ కు రానున్న యుఎస్ వైస్ ప్రెసిడెంట్
NEWS Apr 21,2025 06:45 am
నాలుగు రోజుల పర్యటనలో భాగంగా భారత్ కు ఇవాళ రానున్నారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. ఉదయం 10 గంటలకు ఇటలీ నుంచి ఇండియాకు చేరుకుంటారు. సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. వాణిజ్యం, సుంకాలు, ప్రాంతీయ భద్రతతో పాటు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు వాన్స్.