బస్సు ఓనర్స్ సమావేశం పట్ల జేసీ ఫైర్
NEWS Apr 21,2025 06:23 am
హైదరాబాద్ బస్సు ఓనర్స్ సమావేశానికి ఆహ్వానించక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. ఒకప్పుడు తాము తెలంగాణ నుంచి వచ్చిన వాళ్లమేనని అన్నారు. తమను గద్వాల రాజులు అంటారని, ప్రైవేట్ బస్సు ఓనర్స్ ప్రభుత్వానికి లీజుకు ఇచ్చిన వాళ్లు బస్సులు ఎలా నడుపుకుంటారో చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. మీ ఇష్టానుసారంగా బస్సు ఓనర్స్ సమావేశం ఏర్పాటు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు.