త్వరలో టీజీఎస్ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ
NEWS Apr 20,2025 06:37 pm
మంత్రి పొన్నం ప్రభాకర్ తీపి కబురు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో త్వరలో ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. డ్రైవర్లు సహా వివిధ కేటగిరీల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. కొత్త బస్సుల కొనుగోలు అనంతరం భర్తీ ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కొనసాగుతుండడంతో నోటిఫికేషన్ ఇవ్వడంలో ఆలస్యం జరుగుతుందని పేర్కొన్నారు.