చంద్రబాబు లెజెండ్ లీడర్
NEWS Apr 20,2025 05:27 pm
టీడీపీ నేత బుద్దా వెంకన్న సీఎం చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సీఎం చంద్రబాబు పుట్టిన రోజు. ఆయనకు బర్త్ డే విషెస్ తెలిపారు. 100 కోట్ల మందిలో చంద్రబాబు లాంటి వ్యక్తి ఒక్కరే పుడతారని అన్నారు. దేశం కోసం ప్రజల కోసం పోరాడే వ్యక్తి అని కొనియాడారు. ఆకాశం లో చుక్కలెన్ని వున్నా చంద్రుడు ఒక్కడే అలాగే నాయకులు ఎంతమంది వున్నా బాబు లాంటి నేత ఒక్కడేనని అన్నారు. ముందు చూపు కలిగిన ఏకైక అరుదైన లీడర్ తమ ముఖ్యమంత్రి అని పేర్కొన్నారు.