తిరుమల క్షేత్రం జన సందోహం
NEWS Apr 20,2025 02:46 pm
తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 78 వేల 821 మంది భక్తులు దర్శించుకున్నారు. 33 వేల 568 మంది తలనీలాలు సమర్పించారు. ప్రస్తుతం క్రిష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు భక్తుల లైన్ కొనసాగుతోందని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 18 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు ఈవో జె. శ్యామల రావు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.36 కోట్లు వచ్చిందని తెలిపారు.