వైభవ్ సూర్యవంశీకి గోయెంకా ఓదార్పు
NEWS Apr 20,2025 01:29 am
లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో సంచలనం సృష్టించాడు బీహార్ కు చెందిన 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. స్టార్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. 2 ఫోర్లు 3 సిక్సర్లతో 20 బంతులు ఎదుర్కొని 34 రన్స్ చేశాడు. తన కెరీర్ లో ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్ గా మలిచి ఔరా అని పించేలా చేశాడు. అంతే కాదు అవేశ్ ఖాన్ కు చుక్కలు చూపించాడు. భారీ సిక్స్ కొట్టాడు. తన దూకుడు చూస్తే ఈ మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ చేస్తాడని అనుకున్నారంతా. కానీ మార్కరమ్ బౌలింగ్ లో షాట్ కొట్టేందుకు ముందుకు రావడంతో తెలివిగా పంత్ స్టంపింగ్ చేయడంతో పెవిలియన్ బాట పట్టాడు. కంట తడి పెట్టాడు. మ్యాచ్ ముగిశాక లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా తనను ఓదార్చాడు. ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.