ఘనంగా స్వచ్ఛాంధ్ర దినోత్సవం
NEWS Apr 19,2025 05:24 pm
స్వర్ణాంధ్ర-2047 లక్ష్య సాధనలో భాగంగా ప్రతినెలా మూడో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రాంతాలలో స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని నిర్వహించాలన్న కూటమి ప్రభుత్వం నిర్ణయం మేరకు ఇవాళ గుంటూరు పోలీస్ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి అనిత. స్వయంగా చీపురు పట్టి చెత్తను ఊడ్చి పారిశుద్ధ్య కార్మికుల్లో ఉత్సాహం నింపారు. పరిశుభ్ర, ఆరోగ్య, హరితాంధ్ర ప్రదేశ్‌గా తీర్చిద్దేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతతో మన ఇళ్లు, వీధులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.