టీడీపీ ఎమ్మెల్యే కబ్జాల కూల్చివేత
NEWS Apr 19,2025 04:37 pm
హైదరాబాద్ లో హైడ్రా దూకుడు పెంచింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజధానిలో ఆక్రమణలకు, కబ్జాలకు పాల్పడిన ఏపీకి చెందిన టీడీపీ ఎమ్మెల్యే వసంత కుమార్ కు షాక్ ఇచ్చింది. వేల కోట్ల విలువైన భూములను రక్షించింది. ఆక్రమణలో ఉన్న భూములలో నిర్మాణాలను తొలగించింది. హైడ్రా చర్యలతో రెండు రాష్ట్రాలలో రాజకీయ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఏ పార్టీకి చెందిన వారైనా, ఏ రంగంలో ఉన్నా, ఎంతటి ప్రముఖులైనా సరే కబ్జాలకు పాల్పడితే ఊరుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.