విశాఖ కార్పొరేషన్ టీడీపీ కైవసం
NEWS Apr 19,2025 12:54 pm
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పీఠం తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. జీవీఎంసీ మేయర్ వెంకట కుమారిపై ఎన్డీయే కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. 74 మంది కూటమి నేతలు హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. దీంతో మేయర్ పీఠం కూటమి కైవసం చేసుకుంది. ఈ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది. కాగా ఈనెల 26న మేయర్ ను ఎన్నుకుంటారని కూటమి నేతలు ప్రకటించారు.