కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
NEWS Apr 19,2025 12:09 pm
రైతులు ఆరుగాల కష్టపడి పండించిన వరి దాన్యాన్ని గింజ కటింగ్ లేకుండా కొనుగోలు చేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రామణరావు హామీ ఇచ్చారు.పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఇవాళ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. గత బారాస పాలనలో ధాన్యం తూకంలో పెద్ద మొత్తంలో కోతలు విధించి రైతులను దోపిడీ చేశారని పేర్కొన్నారు. తాను పెద్దపల్లిలో గెలిచిన తర్వాత గింజ కట్టింగ్ లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, అలాగే క్వింటాల్ ధాన్యానికి 500 బోనస్ ఇచ్చి రైతులను ఆదుకుంటున్నామని తెలిపారు.